మినపసున్ని ఉండలు-
కావలసిన పదార్థాలు:--
మినప్పప్పు -- కేజీ
పంచదార -- కేజీ లేదా బెల్లం
బియ్యం -- 1 కప్పు
నెయ్యి : 1/2 కేజీ
తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, మినప్పప్పుని దోరగా వేయించి
పక్కనపెట్టుకోవాలి. కొంచెం చల్లారాక బియ్యాన్ని, మినప్పప్పుని మిక్సీలో
వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని కూడా మిక్సీలో వేసి
మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నెయ్యిని
వేసి కరిగించి, మినపపొడి మీద వేసి బాగా కలిపి, మనకు కావలసినట్టు ఉండలు
చుట్టుకోవాలి. అంతే నోట్లోవేస్తే కరిగిపోయే మినపసున్ని ఉండలు రెడీ.
0 comments:
Post a Comment