మిర్చి కా సాలన్
కావలసిన వస్తువులు:
మిరపకాయలు – 250 గ్రాములు
చింతపండు పులుసు – 1/4 కప్పు
పసుపు – 1/4 టీస్పూన్
కారం పొడి – 1 టీస్పూన్
ఉప్పు – తగినంత
కొబ్బరి పొడి – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
మెంతి పొడి – 1/4 టీస్పూన్
పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్స్
నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు – 2 టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
జీలకర్ర – 1/4 టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మెంతులు – చిటికెడు
నూనె – 4 టేబుల్ స్పూన్స్
ఈ కూర కోసం బజ్జీ మిరపకాయలను వాడాలి. రుచి బావుంటుంది. మిరపకాయలను మధ్యలో
చాకుతో కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలలో కారం
తగ్గుతుంది. ప్యాన్‌లో నూనె వేడి చేసి మిరపకాయలను కొద్దిగా మెత్తబడేవరకు
వేయించాలి. ఒక గిన్నెలో చింతపండు పులుసు, వేయించిన ఉల్లిపాయలు,అల్లం
వెల్లుల్లి పేస్ట్, కారంపొడి, కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, పల్లీలపొడి,
నువ్వుల పొడి, జీలకర్ర , మెంతిపొడి వేసి బాగా కలిపి ఉంచాలి. ఇందాక
మిరపకాయలు వేయించిన ప్యాన్ లోనే నూనె వేడి చేసి జీలకర్ర, మెంతులు వేసి
ఎర్రబడ్డాక పొడులన్నీ కలిపిన చింతపండు పులుసు కప్పుడు నీళ్లు పోసి నిదానంగా
మరిగించాలి. పులుసు, పొడులు ఉడికి కమ్మటి వాసన వస్తుండగా వేయించిన
మిరపకాయలు, గరం మసాలా పొడి వేసి మరో ఐదునిమిషాలు మసాలాలో ఉడకనిచ్చి నూనె
తేలగానే దింపేయాలి. కమ్మటి , ఘాటైన మిర్చి కా సాలన్ తయారైంది. ఈజీగా ఉంది
కదా.. ఈ కూర బిరియాని. వెజ్ ఫ్రైడ్ రైస్, పులావ్ లకు, రొట్టెలకు కూడా
బావుంటుంది.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
November
(21)
- మసాలా మిర్చి
- గ్రీన్ బీన్స్... పచ్చిబఠాణి, క్యారెట్లతో
- సజ్జముద్దలు
- వెజ్ మంచూరియా
- మిర్చి కా సాలన్
- బెంగాలీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ
- . జీరా రైస్
- కొత్తిమీర 'క్యూబ్స్'
- సొరకాయ అప్పాలు
- మిరియం, నిమ్మ పులిహోర
- మసాలా ఇడ్లీ
- ఉసిరి
- దహీ(పెరుగు) ఇడ్లీ
- * మసాలా ఇడ్లీ
- '' బీరకాయ '' తొక్కు పచ్చడి
- * కార్న్ మంచూరియా
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- పాలకూర పకోడీ
- వంటింటి చిట్కాలు మీ కోసం..
- వంటింటి చిట్కాలు
- వంటింటి చిట్కాలు
-
▼
November
(21)
Friday, November 22, 2013
Subscribe to:
Post Comments (Atom)

0 comments:
Post a Comment